‘Greatest of All Time’ Movie Poster Release : లియో తర్వాత మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు స్టార్ హీరో విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో విజయ దళపతి డబుల్ రోల్ ప్లే చేయనున్నారు అంట. ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్ట్ టాపిక్ ఇప్పుడు బయటకు వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక టైటిల్ కు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసినట్లు వెల్లడించారు. పోస్టర్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ద్విపాత్రాబియనంలో ఉన్న విజయ దళపతి పోస్టర్ అది. ఇక ఈ సినిమాకు సంబంధించి కొంత న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ అవుతుంది.

విజయ్ కి జోడిగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తుండగా, ముఖ్యమైన ప్రముఖ పాత్రలలో ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, ప్రశాంత్, యోగి బాబు, గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజు, వంటి వాళ్ళు నటిస్తున్నారని కొంత న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా విజయ్ దళపతి నుంచి వచ్చే ఈ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
