AR Rahman Music for Ram Charan Movie : ప్రతి ఒక్క హీరో ఏఆర్ రెహమాన్ తో తమ సినిమాకి మ్యూజిక్ చేయించుకోవాలి అని ఆశ పడుతుంటారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆ రెంజ్ లో ఉంటుంది. అయితే ఏ ఆర్ రెహమాన్ ఈమధ్య రామ్ చరణ్ సినిమాకి మ్యూజిక్ చేయనున్నట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జరుగుతుంది.
ఆ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఆర్సి 16 సినిమా చేయనున్నారు ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అది కాస్త సెప్టెంబర్ కి వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్, తమిళ నటులు కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాంచరణ్ ఆర్ సి 16 సినిమాలో నటించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమాకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆహ్వానిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ 16 సినిమాకు తను సంగీతం అందిస్తున్నట్టు ఏ ఆర్ రెహమాన్ కొన్ని రోజుల క్రితమే మీడియా ముఖంగా తెలిపారు. నాయకుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రహమాన్ ఈ విషయాన్ని ప్రకటించారు.
Rc16 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి రామ్ చరణ్ మూవీ వెళ్లనుంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై, కిలారు వెంకట్ సతీష్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాంచరణ్ గేమ్ ఛేంజర్ మూవీ పూర్తి కాగానే ఆర్ సి 16 సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అని తెలియడంతో ఈ సినిమాపై హోప్స్ భారీ లెవెల్ లో పెరిగిపోయాయి.