• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

The Reason for the Political Entry of Tamil Heroes : తమిళ హీరోల రాజకీయ ఎంట్రీలు.. రాజకీయం వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు..?

Rama by Rama
February 7, 2024
in Latest News, Political News
0 0
0
The Reason for the Political Entry of Tamil Heroes : తమిళ హీరోల రాజకీయ ఎంట్రీలు.. రాజకీయం వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు..?
Spread the love

The Reason for the Political Entry of Tamil Heroes : సినీ రంగంలో ఉంటూ, రాజకీయ రంగంలో అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకొని ఒక వెలుగు వెలిగిన తారలు ఎందరో ఉన్నారు. ఇటు తెలుగు నాట, అటు తమిళనాట రాజకీయాల్లో అడుగుపెట్టి తమ సత్తా చాటిన హీరో హీరోయిన్లు, పార్టీలు స్థాపించి రాజకీయ రంగానికి ఒక సవాలు విసిరిన తారలను మనం చూసాం. ఇది కామన్ గా జరుగుతున్న విషయమే.

సినీ రంగంలో ఉంటూ రాజకీయాల వైపు మొగ్గు చూపుతూ, ఆ దిశగా అడుగులు వేస్తూ విజయాన్ని సొంతం చేసుకున్న వారు కొందరైతే, అపజయాలను మూట కట్టుకున్న వారు మరికొందరు. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితి నెలకొంది. తమిళచిత్ర పరిశ్రమలో ఎన్నో సంవత్సరం నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని ఎన్నో ఊహగానాలు వస్తూన్నాయి.కానీ ఇప్పటికీ ఆ విషయం పట్ల క్లారిటీలేదు.. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా విజయ్ ఒక కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ఆయన అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని కూడా నింపారుగా. “విజయ్ పీపుల్స్ మూమెంట్” అని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సేవలను ప్రజలకు అందింస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి నిత్యం ప్రజలతో మమేకం కావాలని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుండి మరొక స్టార్ హీరో కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఆ హీరో మరెవరో కాదు విశాల్. విశాల్ కి రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. ఎప్పటినుంచి ఆయన రాజకీయంగా ఎదగాలని కూడా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు విశాల్ కూడా ఒక కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన  వైఎస్ఆర్ సిపి తరఫున చిత్తూరు జిల్లా నుంచి కుప్పంలో విశాల్ పోటీ చేస్తున్నారని కొన్ని కథనాలు బయటికి వచ్చాయి. ఆ తర్వాత కుప్పం నుండి చంద్రబాబు నాయుడి పైన్నే ఆయన పోటీ చేయనున్నారు అని వార్తలు కూడా చాలా విస్తృతంగా ప్రచారం అయ్యాయి. 

కానీ విశాల్ మాత్రం తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ మొదటగా పోటీ చేయాలని భావించారు. కానీ ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. “విశాల్ మక్కల్ నల ఇయక్కం” (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం) ను అన్ని జిల్లాల్లో సంఘాలుగా ఏర్పరిచి బూత్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాల్ షూటింగ్ లకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి సహాయం కూడా చేస్తారు.

తన ప్రజా సంక్షేమ సంఘాల నిర్వాహకులతో మాట్లాడి, తన పార్టీ గురించి విశాల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2024 ఎన్నికల్లో ఇద్దరు హీరోలు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళు ఏ మేరకు విజయాన్ని సాధిస్తారో చూడాలి. అయితే హీరోలు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజలకు మరింత దగ్గరై వాళ్ల సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపాలననే, మంచి ఆలోచనతో ఉన్నారు.

కానీ తమ హీరోలను హీరోలాగే చూసే ప్రజలు ఒక్కోసారి రాజకీయాలలో వాళ్లను అంగీకరించలేరు. అది చరిత్రలో మనకు తెలిసిన విషయమే. తెలుగు ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీని స్థాపించి మళ్లీ నిలదొక్కుకోలేక పోయారు. ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ తర్వాత కనుమరుగయ్యారు. పవన్ కళ్యాణ్ జనసేన తో తన సత్తా చాటుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి విజయం వరిస్తుందని ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తుంది.

ఇక తమిళనాడు నుండి వస్తున్న ఈ ఆలోచనలు ప్రజలకు ఎంత మేలు చేస్తాయో చూడాలి. ఎందుకంటే ప్రజల మనసు గెలవడం అంత సులభం కాదు. రాజకీయ రంగంలో అడుగుపెట్టకముందే ఈ ఇద్దరు హీరోలు తమ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాలా దగ్గరయ్యారు. కానీ రాజకీయ రంగంలోకి ఒక మారు అడుగు పెట్టిన తర్వాత ఏ వ్యక్తి అయినా మారడం ఖాయం అనే నానుడి ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఒకవేళ మన హీరోలు గెలిచినట్లయితే ప్రజలకు ఏమైనా ఉపయోగపడతారా..? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.


Spread the love
Tags: AlluArjunChandrababuNaiduPawanKalyanPolitical Entry of Tamil HeroesPrabhasRamCharanTdpThe Reason for the Political Entry of Tamil HeroesYCPYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.