Husband news : ఈ మద్యకాలంలో కొందరు లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ ఇతరుల జీవితాలను కష్టాలపాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కట్టుకున్నవాళ్ళని అలాగే కన్నవాళ్ళని సైతం తమ విచిత్ర ప్రవర్తనతో ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని గత 12 సంవత్సరాలుగా ఒకే గదిలో నిర్భందించి చివరికి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలని చూడటానికి సైతం ఇబ్బంది పడేలా చేసిన ఘటన మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తీ వివారాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని హిరేగే గ్రామంలో సన్నలయ్యా అనే వ్యక్తి తన కుటుంభ సభయుయలతో కలసి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ వ్యక్తి స్థానికంగా చిన్నపాటి ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఫ్యామిలీ ని లీడ్ చేసేవాడు. అయితే సన్నలయ్య కి తన వ్యక్తిగత కారణాలవల్ల అప్పటికే తన మొదటి ఇద్దరి భార్యలతో విడిపోయాడు.
అయినప్పటికీ సన్నలయ్య కుటుంబ సభ్యులు అతడి భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని సుమ అనే యువతిని ఇచ్చి మూడో వివాహం చేశారు. అయితే పెళ్ళయిన మొదటి రాత్రి నుంచే సన్నలయ్య తన భార్య సుమ కి నరకం చవపించటం మొదలు పెట్టాడు. ఈ ఈ క్రమంలో ఇతరులతో సంభాషించడం, అలాగే చూడటం వంటివి చేయకూడదని కండీషన్లు పెట్టాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో మొదట్లో సుమ కూడా తన భర్త మాటకి ఎదురు చెప్పలేదు.

కానీ ఏళ్లు గడిచే కొద్దీ సన్నలయ్య ప్రవర్తనా తీరు మరింత దిగజారిపోయింది. ఈ క్రమంలో సుమ ఎవరితోనైనా మాట్లాడినా, చూసినా అనుమాన పడటం, చిత్ర హింసలకి గురిచేయడం వంటివి చేసేవాడు. ఇక ఈ మధ్య కాలంలో సుమ పై అనుమానం మరింత ఎక్కువకావడంతో సన్నలయ్య ఏకంగా సుమ ని గదిలో నిర్భందించాడు. దీంతో సుమ తన పిల్లలని చూడటానికి కూడా సన్నలయ్య అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే గత కొద్ది రోజులుగా సన్నలయ్య ప్రవర్తన ని గమనిస్తున్న స్థానికులు సుమ ని గదిలో నిర్భందించిన విషయం తెలుసుకున్నారు. దీంతో వెంటనే దగ్గరలోని పోలీసులకి సమాచారం అందించి సన్నలయ్య ని అరెస్ట్ చేయించారు. అలాగే సుమ ని విచారించగా సన్నలయ్య భాగవతం బయటపడింది. దీంతో పలు సెక్షన్ల క్రింద సన్నలయ్య పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
