HanuMan vs Sri Anjaneyam : ఛార్మిని తిడుతున్న నెటిజన్లకు డైరెక్టర్ కౌంటర్
నితిన్ కెరీర్ మంచి జోష్ లో ఉన్న టైంలో కృష్ణ వంశీ దర్శకత్వంలోని శ్రీ ఆంజనేయం చిత్రం విడుదలయింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన ఆ చిత్రం నితిన్ ఫ్లాపుల్లో ఒకటిగా చేరిపోయింది. ఆంజనేయస్వామి బ్యాక్ డ్రాప్ లో మంచి విజువల్ ఫీస్ట్ ఇవ్వాలని కృష్ణ వంశీ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం తప్పు కాదు. కానీ ఆ చిత్రం తెరకెక్కించిన విధానం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.
అయితే హను మాన్ చిత్రం రిలీజ్ అయిన తర్వాత సడెన్ గా శ్రీ ఆంజనేయం చిత్రం గురించి నెటిజన్లు మాట్లాడుకోవడం ప్రారంభించారు. హను మాన్ చిత్రంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొన్ని అద్భుతమైన సన్నివేశాలని ఎలివేట్ చేశారు. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో పాటు భక్తిని నింపేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. విలన్ పాత్రని, సుగ్రీవుడి పాత్రని కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం చాలా బావుంది.
ఫలితంగా హను మాన్ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించింది. అయితే కొందరు నెటిజన్లు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం చిత్రమే బావుంటుందని అంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలయింది. ఒక నెటిజన్ అయితే ఆడియన్స్ సరిగ్గా శ్రీ ఆంజనేయం చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయారని బ్లేమ్ చేశాడు. దీనితో డైరెక్టర్ కృష్ణ వంశి సదరు నెటిజన్ కి రిప్లై ఇచ్చారు.
Audience r never wrong .. they didn’t like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm
— Krishna Vamsi (@director_kv) February 11, 2024
ఆడియన్స్ ని తిట్టడం కరెక్ట్ కాదు. శ్రీ ఆంజనేయం చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేయడంలో మిస్టేక్ జరిగింది అని సమాధానం ఇచ్చారు. ఆడియన్ ఎప్పుడూ తప్పు కారు అని అన్నారు. ఈ క్రమంలో కొందరు ఛార్మిపై కూడా విరుచుకుపడ్డారు. శ్రీ ఆంజనేయం ఛార్మి పాత్ర విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో పాటలు కూడా వర్కౌట్ కాలేదు. ఛార్మిని అవసరానికి మించి గ్లామర్ గా చూపించారు. ఓ నెటిజన్ ఛార్మి పాత్ర వల్లే ఈ చిత్రం నిరాశపరిచింది అన్నట్లుగా పోస్ట్ చేశారు. ఆమె పాత్ర ఇర్రిటేషన్ తెప్పిస్తుందని కామెం ట్ చేశాడు. దీనితో కృష్ణ వంశీ గాడ్ బ్లెస్ యూ అంటూ అతడికి కౌంటర్ ఇచ్చారు.
GOD bless you 🙏 https://t.co/1AcCs3Q2vq
— Krishna Vamsi (@director_kv) February 11, 2024
