Supritha Video Viral : తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి తెలుగు ఆడియన్స్ కి సపరిచితమే. అయితే ఈ మధ్య కాలంలో నటి సురేఖవాణి ఎక్కువగా సోషల్ మీడియాలో తనకి సంబందించిన పొటోలు వీడియొలు షేర్ చేస్తూ బాగానే పాపులర్ అవుతోంది. ఈ క్రమంలో నటి సురేఖవాణి కూతురు సుప్రీత కూడా అప్పుడప్పడూ తనకి సంబందించిన ఫోటోలు వీడియొలు షేర్ చేస్తూ బాగానే పాపులర్ అవుతోంది. అయితే సుప్రీత ఇప్పటివరకూ సినిమాల్లో నటించలేదు. కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లని సంపాదించుకుంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి.
Supritha Video Viral :
అయితే తాజాగా సుప్రీత తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో సుప్రీత ఓటీటీలో మంచి హిట్ అయిన 90’స్ – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో బాగా ఫేమస్ అయిన సాంప్రదాయని సుబ్బిని, సుద్దాపూసనీ అనే డైలాగ్ ని సింక్ చేస్తూ ఉదయం సమాయంలో సాంప్రదాయ దుస్తులను ధరించి పూజ చేస్తూ కనిపించింది. అలాగే సాయంత్రం సమయంలో వెస్టర్న్ డ్రస్ తో పబ్బులో డ్యాన్స్ లో కనిపిస్తూ రీల్ చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియొపై నెగిటివ్ గా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దాంతో సుప్రీత చివరికి కామెంట్ బాక్స్ ని ఆఫ్ చేసింది. అయినప్పటికీ కొందరు మీమర్లు మాత్రం ఉదయం అలా, సాయంత్రం ఇలా అంటూ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఇప్పుడున్న జెనరేషన్ లో కాలంతోపాటూ అలాగే సందర్భాన్ని బట్టి కట్టు బొట్టు మారుతుందని అందులో తప్పేముందని సుప్రీత కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ సుప్రీత మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదంటున్న సుప్రీత:
ఈ విషయం ఇలా సుప్రీత వెండితెరపై అలరించకపోయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే అందాలు ఆరబోస్తూ తన అభిమనులకి అందాల విందు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా ఘాతిగా ఫోటో షూటలు చేస్తూ గ్లామర్ షో చేస్తోంది. దీంతో సుప్రీత హీరోయిన్ పీస్ అని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే కచ్చితంగా మంచి ఆఫర్లు దక్కించుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. కానీ సుప్రీత మాత్రం తనకి హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదని గతంలో పలు సందర్భాలలో చెప్పింది. అలాగే నటి సురేఖవాణి కూడా తన కూతురికి హీరోయిన్ ఇష్టం లేదని దాంతో సుప్రీత కి ఎందులో ఆసక్తి ఉందో ఆడే రంగంలో రాణించేందుకు ప్రోత్సాహిస్తానని స్పష్టం చేసింది.
వీడియొ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..