పిక్ టాక్ : వాలంటైన్స్ డే రోజు గ్లామర్ బాంబులా బ్రో హీరోయిన్
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రంతో కేతిక శర్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతవరకు ఈ యంగ్ బ్యూటీకి ఒక్క హిట్ చిత్రం కూడా పడలేదు. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించిందనే సంతృప్తి ఆమెకి ఉంది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల బ్రో చిత్రంలో కేతిక శర్మ నటించిన సంగతి తెలిసిందే. అయితే బ్రో చిత్రంతో పాపులారిటీ దక్కినప్పటికీ ఆ మూవీ హిట్ కాలేదు. అంతకు ముందు వైష్ణవ్ తేజ్ తో నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం కూడా నిరాశ పరిచింది.
సినిమా హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఎలా ఉన్నపటికీ కేతిక శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ మోత మోగిస్తోంది. నేడు ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా కేతిక శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన రెడ్ డ్రెస్ ఫొటోస్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఫ్లవర్స్ చేతిలో పట్టుకుని కేతిక ఇస్తున్న ఫోజులు యువత ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. అంత హాట్ హాట్ గా కేతిక ఫోజులు ఇచ్చింది.