గోదారి మాటలు ఎప్పుడూ వాలునుబట్టి సాగిపోతూ వుంటాయ్. ఆళ్ళకి కోపం వచ్చినా.. ప్రేమోచ్చినా.. కొత్తనీరు మీద గోదాట్లో పులస ఎదురెక్కినట్టు మాటాడుతూనే వుంటారు. అనేదేదో మొహమ్మీదే మెత్తగా అనేసి “ఏమనుకోకురా అబ్బాయ్” అని సల్లగా జారుకుంటారు. వారి జీవితాల్లో కపటంలేని తనాన్ని.. గంజి కోసమోస్తే ఇందుబోజనం ఎట్టంపేటంత పేమని, అలవాట్లని కలవాట్లలో కూడ వదులుకోలేని గుణాన్ని.. ఆగ్రహాన్ని తరచుగా నెమరేసుకోవాలంటే…
మా “గోదారోడి కబుర్లు” ట్రెండ్ ఆంధ్రా లో సూత్తుండండి..
