Pooja Hegde : అందుకే గుంటూరు కారం నుంచి పూజ పాప ని తప్పించారా.?
Pooja Hegde : ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇటు థియేటర్స్ లో అలాగే ఓటీటీ లో కూడా మంచి సక్సస్ ని సాధించడంతో పాటు దర్శక నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఇక ప్రకాష్ రాజ్, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది.
Pooja Hegde : అందుకే గుంటూరు కారం నుంచి పూజ పాప ని తప్పించారా.?
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మొదట్లో ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడీగా ముంబై బ్యూటీ పూజా హెగ్డే ని తీసుకోవాలని నిర్ణయించారట. ఈ క్రమంలో నిర్మాతలు రెమ్యునరేషన్ కి సంబందించిన చెక్కు కూడా పూజా హెగ్డే కి పంపించారట. దీంతో కొద్ది రోజులపాటూ సినిమా షూటింగ్ కి హాజరైన పూజా హెగ్డే మళ్ళీ బాలీవుడ్ చిత్ర షూటింగ్ లతో బిజీ అవ్వడం, అలాగే షూటింగ్ డేట్ల ని తరచుగా మారుస్తుండటంతో విసుగు చెందిన నిర్మాతలు పూజా హెగ్డే ని హీరోయిన్ గా తప్పించాలని నిర్ణయించారట.

రెమ్యూనరేషన్ పెంచేసిందట:
అలాగే పారితోషికం కూడా పెంచడంతో నిర్మాతలు ఆమె స్థానంలో శ్రీలీల ని తీసుకున్నట్లు పలు వార్తలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ మధ్య పూజా హెగ్డే కి టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి లేదని కానీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఆఫర్ల విషయంలో కొంతమేర సపోర్ట్ గా ఉండటంతో అడపాదడపా సినిమాల్లో నటిస్తోందని మరికొందరు అంటున్నారు.
తెలుగు సినిమాలకి ఒకే చెప్పడం లేదట :
ఈ విషయం ఇలా ఉండగా పూజ హెగ్డే చివరగా తెలుగులో ఆచార్య చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఎఫ్:3 చిత్రంలో కామియో అప్పియరెన్స్ రోల్ లో కనిపించింది. మళ్ళీ పూజా హెగ్డే కొత్త చిత్రాలకి పచ్చజెండా ఒప్పడం లేదు. ఇక పూజ హెగ్డే కి ప్రత్యామ్నయంగా శ్రీ లీల, మీనాక్షీ చౌదరి, రష్మిక మందాన, కృతి శెట్టి తదితర హీరోయిన్లు ఉండటంతో ఈ బ్యూటీ ని పెద్దగా పట్టించుకోవడం లేదని బయట టాక్.