ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఈరోజు కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టారు. రెవిన్యూ శాఖ లో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు పూర్తయిన వెంటనే బదిలీ చేయాలి, రుణాల మంజూరుకు పాసు పుస్తకాలను బ్యాంకులో పెట్టుకోరాదు, ప్రభుత్వ భూములకు పాసుపుస్తకాలు ఇస్తే కలెక్టర్లకు రద్దు చేసే అధికారం, రికార్డు పూర్తి చేసి కొన్న వారికి బదిలీ చేయడం, డిజిటల్ రికార్డులు ఆధారంగానే వ్యవసాయ రుణాలు తదితర అంశాలను పోందుపరిచామని కేసీఆర్ తెలిపారు.
ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసుల మధ్య విభజన జరగేలా అందులో పొందుపరిచారు.
అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ విభాగాల్లో ధరణి పోర్టల్ ప్రవేశపెట్టారు. అన్ని వివరాలతో ఈసీ ధరణి పోర్టల్ లో వస్తుంది.
ధరణి పోర్టల్ లో వ్యవసాయ, వ్యవసాయేతర విభాగాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ధరణి పోర్టల్ లో వివరాలు ఓపెన్ చేసి చూడవచ్చని, అవసరమైన వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని కెసిఆర్ వివరించారు. మేము మూడేళ్లుగా చాలా కష్టపడి భూ కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా కొంత ఫలితం మాత్రమే వచ్చిందని కరోనా దృష్ట్యా ఆలస్యం జరుగుతుందని, ఇప్పటికే భూప్రక్షాళన మొదలుపెట్టామని, ఇకపై రెవెన్యూ కోర్టులు ఉండవని ఏ స్థాయి అధికారి కూడా విచక్షణాధికారం ఉండకూడదని, గ్రామంలోని భూముల హక్కుల వివరాలను స్టోరేజ్ చేయాలని, రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వ అధికారుల పై దావా వేయకూడదు ఉద్యోగులకు ఎలాంటి డోకా లేదని, 5,486 మంది విఆర్వో లకు ఉద్యోగ భద్రత ఉంటుందని,
20,292 మంది వీఆర్ఏలు ఉన్నారని, వీరిని స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తామని వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
నిషేధిత భూములు ఇకపై రిజిస్ట్రేషన్లు కావని, తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయిస్తామని తెలంగాణలో ఇప్పటివరకు భూ వివాదాలలో 16137 కేసులు నమోదయ్యాయని, పాస్ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహశీల్దారుకె ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భూభాగం 2.75 ఎకరాలు భూముల అంశములో అంతులేని అవినీతి జరిగిందని, రెవిన్యూ పట్ల ప్రజలకు శత్రుత్వ భావం వచ్చిందని, కొత్తగా ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, పాస్ పుస్తకం లో పట్టాదారు పేరు, సర్వే నంబర్లు, విస్తీర్ణం పొందుపరచి ఉండాలని, తప్పు చేసిన తహ శీల్దారు పై భర్తరఫ్, క్రిమినల్ చర్యలు తప్పవని, తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అనివార్యంగానే ఈ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశామని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బిల్లు వర్తిస్తుందని, అవినీతి అంతం కావాలి ఇది ఈ చట్టం యొక్క లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు.
