Bellamkonda Srinivas : ఎవరికి సాధ్యం కానీ రికార్డు సృష్టించిన బెల్లంకొండ..
యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తెలుగులో ఇప్పటివరకు 8 సినిమాలు చేశాడు ఇందులో కమర్షియల్ గా ఒక్కటే ఒకటి హిట్ అయ్యింది అదే రాక్షసుడు. ప్లాపులు ఎక్కువ కావడం తో రావాల్సిన ఫేమ్ రావడం లేదు ఈ హీరోకి. కటౌట్ బాగానే వున్న పూర్ స్టోరీ సెలక్షన్ తో దెబ్బతింటున్నాడు.అయితే తెలుగులో మనోడి పరిస్థితి ఇలా ఉంటే నార్త్ లో దీనికి పూర్తిగా భిన్నంగా వుంది.ఇక్కడి టాప్ హీరోలే హిందీ మార్కెట్ ను పొందడానికి నానా అవస్థలు పడుతుంటే కేవలం యూట్యూబ్ లో తన డబ్బింగ్ సినిమాలు ద్వారా అక్కడ పాపులర్ అవుతున్నాడు ఈ హీరో. ఈయన నటించిన సినిమాలు అక్కడ హిందీ లో డబ్బింగ్ అయ్యి రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబడుతున్నాయి.
Bellamkonda Srinivas : జయ జానకి నాయక 800మిలియన్లకు పైగా వ్యూస్
బోయపాటి శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబో లో వచ్చిన జయజానకి నాయక తెలుగులో యావరేజ్ గా ఆడింది. ఈసినిమాను హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో వదిలారు. ఇప్పటివరకు 800మిలీయన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమా ఈ ఫీట్ దరిదాపుల్లోకి కూడా రాలేపోయింది. ఒక్క జయ జానకి నాయక మాత్రమే కాదు శ్రీనివాస్ నటించిన కవచం హిందీ వెర్షన్ రెండు ఛానళ్లలో కలిపి 830మిలియన్లు అలాగే సీత హిందీ వెర్షన్ 650మిలియన్ల పైగా వ్యూస్ ను రాబట్టాయి.
Rakul Preeth Sing Wedding : అంగరంగ వైభవంగా రకుల్ వివాహం.. పెళ్లి ఫోటోలు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి
అయితే ఈ సినిమాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో శ్రీనివాస్ హిందీ లో డైరెక్ట్ గా సినిమా చేసి ఎంట్రీ ఇచ్చాడు.తెలుగు బ్లాక్ బాస్టర్ ఛత్రపతి ని అదే పేరుతో హిందీ లో రీమేక్ చేసి గత ఏడాది సమ్మర్ లో థియేట్రికల్ రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది.మినిమమ్ కలెక్షన్స్ కూడా రాలేదు దాంతో మళ్ళీ తెలుగులోనే సినిమా చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం బీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో శ్రీనివాస్ తన 10వ సినిమా చేస్తున్నాడు.టైసన్ నాయిడు అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాను 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే బెల్లంకొండ ఈసారి గట్టిగానే కొట్టేలా వున్నాడు.

