RC 16 Janhvi Kapoor : కంఫర్మ్.. చిరంజీవి కొడుకుతో శ్రీదేవి కూతురు రొమాన్స్.. RC16 లో జాన్వీ కపూర్, ఇది కదా కావలసింది
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రికగ్నైజేషన్ లభించింది. ఇక పాన్ ఇండియా వైడ్ గా అయితే ఆ క్రేజ్ వర్ణించలేం. రాంచరణ్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ జై శ్రీరామ్ అనేస్తున్నారు. అంబానీ పెళ్లి వేడుకలో కూడా రాంచరణ్ ఒక రేంజ్ లో హైలైట్ అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం తర్వాత అత్యంత భారీ బడ్జెట్ లో చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒక రేంజ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ల గురించి వరుసగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే కొంతకాలంగా జాన్వీ కపూర్ నటించే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది.

ఇప్పుడు అదే నిజమైంది. మైత్రి మూవీస్ సంస్థ అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించింది. నేడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో ఆర్ సి 16లోకి ఆమెకి స్వాగతం చెబుతూ పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఈ న్యూస్ యమా క్రేజీగా మారిపోయింది. ఎందుకంటే.. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ గురించి అందరికి తెలిసిందే.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఈ జంటని ఎన్ని తరాలైన మరచిపోవడం కష్టం. ఇప్పుడు చిరంజీవి కొడుకు. శ్రీదేవి కూతురు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ డెడ్లీ కాంబినేషన్ అని అంటున్నారు. మరి చూడాలి.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చిరంజీవి, శ్రీదేవి లని మించేలా ఉంటుందో లేదో. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జోడిగా దేవర చిత్రంలో నటిస్తోంది.