Tamannaah photos : ఇది కదా అందమంటే.. వెన్నెలంతా పోగేసినట్లు తెల్ల చీరలో తమన్నా, వైరల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్దం పైగా తమన్నా తన గ్లామర్ తో సౌత్ లో ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మిల్కీ బ్యూటీగా తమన్నా యువత హృదయాల్లో కొలువైంది.
తమన్నా తాజాగా ముంబైలో ఓ అవార్డుల వేడుకలో మెరిసింది. అక్కడ చిమ్మ చీకట్లలో సైతం తమన్నా నిండు జాబిలిలా వెలిగిపోతూ కనిపించింది. తమన్నా ధరించిన చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

