MixUp Trailer : మిక్స్ అప్ ట్రైలర్ చూశారా, బాబోయ్ మరీ పచ్చిగా ఉంది.. అడల్ట్స్ కి మాత్రమే, ఆహాలో రిలీజ్ డేట్ ఇదే
ఓటిటి హవా పెరిగిన తర్వాత బోల్డ్ కంటెంట్ తో చిత్రాలు కూడా ఎక్కువయ్యాయి ఓటిటిలో డైరెక్ట్ గా పిచ్చి బూతులతో వెబ్ సిరీస్ లు, చిత్రాలు వచ్చేస్తున్నారు. శృంగారాన్ని హైలైట్ చేస్తూ యువత టార్గెట్ గా ఇలాంటి వెబ్ సిరీస్ లు, చిత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవకి చెందిన చిత్రమే మిక్స్ అప్.
ఆహా ఓటిటిలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి.. కమల్ కామరాజు, అక్షర గౌడ జంటలుగా ఈ చిత్రంలో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మరీ పచ్చిగా, శృంగార సన్నివేశాలతో దారుణంగా ఉంది. కొన్ని నెలలకే మ్యారేజ్ లైఫ్ బోర్ కొట్టేసిన ఈ రెండు జంటల కథ ఇది.
ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి జంటలో ఆదర్శ్ ఎక్కువగా శృంగారం కోరుకుంటారు. కనై పూజా జవేరి ప్రేమ ముఖ్యం అంటూ ఉంటుంది. మరో జంటలో కమల్ కామరాజు ప్రేమ కోరుకుంటే అతడి భార్య అక్షర గౌడకు శృంగార పట్ల కోరికలు ఎక్కువగా ఉంటాయి. దీనితో అక్షర గౌడ, ఆదర్శ్ తో సంబంధం పెట్టుకుంటుంది. కమల్ కామరాజు, పూజా ఒక్కటవుతారు. ఇలా పార్ట్నర్స్ మారిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ.
ట్రైలర్ మొత్తం బూతులు, బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నాయి. అక్షర గౌడ అయితే రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది. ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో అని కామెంట్స్ పేలుతున్నాయి. గ్లామర్ ప్రియులకు మాత్రమే ఈ చిత్రం పండగ అనిపించేలా ఉంది. గతంలో దీపికా పదుకొనె, అనన్య పాండే నటించిన గెహరియన్ చిత్రం గుర్తుందిగా. మిక్స్ అప్ ట్రైలర్ ఆ చిత్రాన్ని పోలినట్లుగానే ఉంది. దీనితో కొందరు మిక్స్ అప్ ని ఆ మూవీ నుంచి కాపీ చేసారా అని కామెంట్స్ చేస్తున్నారు.
