Venkatesh Daughter : దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకటేష్ రెండో కూతురికి వివాహం డేట్ ఫిక్స్, డీటెయిల్స్
మరోసారి దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. కొన్ని నెలల క్రితమే దగ్గుబాటి సురేష్ బాబు తన రెండవ కుమారుడి వివాహం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వంతు వచ్చింది. వెంకటేష్ రెండవ కూతురు హయవాహినికి త్వరలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
మార్చి 15 అంటే శుక్రవారమే వెంకటేష్ రెండో కుమార్తె వివాహం జరగబోతోంది. వెంకటేష్ మొదటి కుమార్తె వివాహం ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు రెండవ కుమార్తె కూడా పెళ్ళికి రెడీ అవుతోంది. కొన్ని నెలల క్రితమే హయవాహిని నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లి వేడుకని కూడా సింపుల్ గా రామానాయుడు స్టూడియోస్ లో జరిపించబోతున్నారు.

కొద్దిమంది బంధువులు, ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగబోతోంది. హయవాహినికి కాబోయే భర్త విజయవాడకి చెందిన డాక్టర్ అట. అతడి కుటుంబ వివరాలని, పెళ్లి వివరాలని కాస్త గోప్యంగానే ఉంచారు.
వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు సంతానం. వెంకటేష్ కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. మొదటి కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి పెళ్లి వేడుక 2019లో జైపూర్ లో వైభవంగా జరిగింది.
