సీరియల్ నటి శ్రావణి కేసులో రోజుకొక సంచలనాత్మక విషయం బయటకు వస్తుంది. సినిమాలో మాదిరి కొత్తకొత్త క్యారెక్టర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఆర్ఎక్స్100 నిర్మాత అశోక్ రెడ్డిది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా శ్రావణితో ఉన్న సాన్నిహిత్యం తో ఆర్ఎక్స్ 100 సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చినట్లు వెల్లడించారు. అంతేకాక వ్యక్తిగతంగా శ్రావణి కి పలుమార్లు ఆర్థిక సాయం చేసాడు. ఆర్థిక సాయం నెపంతో ఆమెని వేధించి, శ్రావణి తనను కాదని ఎవరిని వివాహం చేసుకోకూడదని బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇక మరోవైపు శ్రావణి దగ్గరైన మూడవ వ్యక్తి అయిన దేవరాజ్ రెడ్డి.. సాయి, అశోక్ రెడ్డి లను వదిలించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లపాటు శ్రావణిని దూరం పెట్టాడు. ఇలా ముగ్గురితో ఎన్నో వేధింపులకు గురైన శ్రావణి లోలోనే ఎంతో కుమిలిపోయింది. నిర్మాత అశోక్ రెడ్డి శ్రావణి చనిపోయే గంట ముందు తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని అదే సమయంలో సాయి కూడా ఇంటికి వచ్చి జోక్యం చేసుకోవడంతో వీరి ముగ్గురి ప్రవర్తనకు మనస్థాపానికి గురి అయి ఆత్మహత్యకు పాల్పడిందని అశోక్ రెడ్డిని చేసిన విచారణలో వెల్లడైంది. నా చావుకు సాయినే కారణం అని దేవరాజ్ రెడ్డితో సంభాషణ ఒక ఆడియో టేప్ ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ కేసులో ఎటుచూసినా అనేక రకాల కోణాలు బయటకు వస్తున్నాయి. తుది నివేదిక వచ్చాక అసలు దోషులెవరు అనేది తేలాల్సి ఉంది.
