హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను, ఆ సంఘటన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేసిన వారిని అరెస్టు చేసిన కారణాలను నిరసిస్తూ.. బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు ఛలో అమలాపురంకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అమలాపురం పట్టణంలోనే కాకుండా కోనసీమ వ్యాప్తంగా144 సెక్షన్ అమలు చేశారు. స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులను గృహనిర్బంధం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ని నిన్న సాయంత్రం విజయవాడ లో అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా అమలాపురం పట్టణానికి చెందిన బిజెపి రాష్ట్ర నాయకుడు నల్లా పవన్ కుమార్ ని ఆయన స్వగృహంలో గృహ నిర్బంధం చేశారు. పట్టణమంతా పోలీసు బలగాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
