హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ& కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నిశ్శబ్దం”. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని గత వేసవిలో విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 2వ తేదీన ప్రైమ్ లో ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
రెండేళ్ల క్రితం విడుదలైన “భాగమతి” లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అనుష్క మూగ, చెవిటి, కలిగిన దివ్యాంగురాలి పాత్రలో “నిశ్శబ్దం” చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషలు సైలెన్స్ పేరుతో విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం విడుదల కోసం స్వీటీ అనుష్క అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
