• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

యువీ ఈగోని గెలికినదానికి 13 ఏళ్ళు

TrendAndhra by TrendAndhra
September 22, 2020
in Special Stories
0 0
0
యువీ ఈగోని గెలికినదానికి 13 ఏళ్ళు
Spread the love

అసుంటి కొట్టుడు నేను లైఫ్ లా చూడలేదురా బై .. అరే ఏం కొట్టుడు కొట్టిండు రా..

ఆ శివమణి డ్రమ్ము కొట్టినట్టు.. జాకీర్ హుస్సేన్ తబలా గొట్టినట్లు.. మన శంకర్ సైన్మా కి రెహమాన్ గొట్టినట్టు.. తెలంగాణా శకుంతల వేణుమాధవ్ ని ఉర్కించి ఉర్కించి కొట్టినట్టు.. మస్తు కొట్టిండు మన యూవీ.. బాదుడే.. బాదుడు..కొట్టుడే కొట్టుడు.. 2007లా యూవీ జేసిన గీ మజాక్ కి ఈ డైలాగు మస్త్ సూట్ ఐతది.

ఆ సంవత్సరం సెప్టెంబర్ 19 లా.. టి20 వరల్డ్ కప్ లో కింగ్స్ మేడ్ డర్బన్ స్టేడియంలో ఈ దంచుడు షూరు అయింది.. గా తెల్ల పోరగాండ్ల ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ ల మొదటి బ్యాటింగ్ చేస్తున్న మనోళ్ల ఇన్నింగ్స్ 19వ ఓవర్ల గీ ఉతుకుడు షురూ అయ్యింది.. యూవీ దంచిన ఈ దంచుడు ఎట్లుంది అంటే.. అమ్మోరు దగ్గర మేకపోతు బలి అయినట్టే ఉందిరా బై.. ఆ బలి అయింది ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అంట ..

ఈ బలి వెనుక ఉన్నది మాత్రం గా ఫ్లింటాఫ్ గాడే..

ఆడే.. వద్దురా అంటే పోయి పోయి మనోడితో కొట్లాటకు పాయే.. మనం రూపాయి లేకున్నా ఉంటాం కానీ ఎదుటోడు రెచ్చగొడితే ఉరుకుంటమా?? పగోడిని కళ్ల ముందు జూసినట్టే అనుకుండు ఇగ యువీ..

ఇగ జూసుకో.. బ్రాడ్ గాడి కలలో కూడా వదలని సంగతి అయిపాయె అప్పుడు.. పాపం పోరగాడు అని మనమే యేడ్చినం ఆరోజు.. ఆ కొట్టుడుని జీవితంలో మర్చిపోడు బిడ్డ… బ్రాడ్

ఏ బాల్ ఎట్నుంచి అయినా ఎయ్ రా దాని సంగతి జెప్తా అంటూ కనీస ఇసుమంత దయ లేకుండా ఇస్టేడియం అవతలకి పంపిస్తున్న యువరాజ్ ని కళ్ళు తేలేసి చూడటం తప్ప ఏమీ జేయలేక జూస్తుండు ఆ బాల్ ఏసినోడు. టి-20 చరిత్రలోనే యువరాజ్ ఆడిన ఆట రికార్డుగా ఉంది రా బై ఇప్పటికీ.. స్టేడియంలోని ప్రేక్షకులే కాదు దునియా మొత్తం జూసిన క్రికెట్ అభిమానులు అందరూ ఆ ఓవర్ మర్చిపోరు.. నాకు దెలిసి ఫుల్ బాటిల్ లేపొచ్చు మామిడికాయ బద్ద నాకుతూ..

టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ గా జరిగిన ఈ ఆటలో మొదట బ్యాటింగ్ చేసిన మనోళ్లు యువరాజ్ సింగ్ రేపిన దుమ్ముకి శివాలు ఊగింది.. మనోడు 16 బాల్స్ లా 58 పరుగులు (మూడు ఫోర్లు, ఏడు సిక్స్ లు) దంచిండు.. ఇగ ఆ తర్వాత 4 వికెట్లకు 218 పరుగులు కొట్టిర్రు మొత్తంమీద.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గా ఇంగ్లాండ్ వోల్లు 6 వికెట్లకు 200 పరుగులే జేసీ ఓడిపోయిర్రు.

గట్ల ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కి చేరిన మనోళ్లు ఇగ నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడగొట్టి కప్పు తెచ్చె మనకి ..

గదే రా బై ఆఖరి ఆట ఇక కప్పు తెస్తానికి అన్నట్టు..

అవతల ఉన్నది గా పాకిస్తానోళ్లు.. ఇగ పాకిస్తాన్ అంటే మనోళ్లు ఊరుకుంటారా జెప్పండ్రి.. చల్.. ఆఖరికి బాంగ్లాదేశ్ గాళ్ళతో అయినా ఓడిపోతాం గానీ.. గీ పాకిస్తాన్ తో ఎట్ల ఓడిపోతాం అనుకుర్రు మనోళ్లు.. లాస్ట్ బాల్ దాకా కొట్లాడి కొట్లాడి చివరికి గాళ్ళని ఓడించి 2007 t20 వరల్డ్ కప్ ని తెచ్చి మన దేశానికి అంకితం జేసిండ్రు..

గా వీడియో మీకోసం..


Spread the love
Tags: 13 Years for Yuvi ultimate BattingFilntoffStuvart BrodYuvaraj Singh over EnglandYuvi batting
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.