Nidhhi Agerwal About HariHara Veeramallu:జూలై 24న హరిహర వీరమల్లు రిలీజ్
జూలై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రేక్షకుల్లో ఊహకందని అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత హరిహర వీరమల్లులపై హైప్ మరింత పెరిగింది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గూస్ బంప్స్ తెప్పించే డైలాగులు చెబుతూ, యాక్షన్స్ సన్నివేశాలతో అదరగొట్టారు. అంతకు మించేలా కంప్లీట్ సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ మూవీలో నటించడానికి కారణం చెప్పిన నిధి అగర్వాల్
క్రిష్, జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిధి అగర్వాల్ తాజాగా ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లు గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. హరిహర వీరమల్లు చిత్రాన్ని కి అంగీకరించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.. నిధి అగర్వాల్ ఇది పవన్ కళ్యాణ్ సినిమా అని సమాధానం ఇచ్చారు. పైగా ఏఎం రత్నం లాంటి లెజెండ్రీ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంగీకరించడానికి ఇంతకంటే కారణాలు ఏం కావాలి అని నిధి అగర్వాల్ తెలిపింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే 100 సినిమాల్లో నటించిన అంత గుర్తింపు వస్తుంది. డైరెక్టర్ క్రిష్ గారు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. నేను పోషించిన పంచమి పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని నిధి అగర్వాల్ తెలిపింది. ట్రైలర్ ముందు వరకు ఈ మూవీ గురించి చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి.

ఆ సీన్ చాలా కష్టం
ఈ చిత్రంలో ఛాలెంజింగ్ గా అనిపించిన అంశాలు ఏంటి అని ప్రశ్నించగా నిధి అగర్వాల్ సమాధానం ఇచ్చారు. ఈ మూవీలో భరత నాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది ఆ సన్నివేశం లో నటించాలంటే చాలా కష్టం. ఛాలెంజింగ్ గా తీసుకొని సన్నివేశం అద్భుతంగా వచ్చేలా నటించగలిగాను అని నిధి అగర్వాల్ పేర్కొంది.

పవన్ కళ్యాణ్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆయన ద్వారా నేను కూడా ఎంతో కొంత నేర్చుకోగలిగాను అని నిధి అగర్వాల్ పేర్కొంది.