Ram Charan Look in Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ అల్టిమేట్ మేకోవర్..
Ram Charan Look in Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోను పంచుకుంటూ రామ్ చరణ్, “పెద్ది కోసం మారుతున్నాను ఇలా.. దృఢమైన సంకల్పం.. గొప్ప ఆనందం” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో చరణ్ పదునైన, శక్తివంతమైన శరీరాకృతితో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ పాత్ర కోసం ఆయన పెడుతున్న కృషి, క్రమశిక్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు; పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు ఆయన సంకల్పాన్ని చాటుతోంది. ఆయన పోనీటైల్, గుబురు గడ్డంతో మరింత ఆకర్షణనీయంగా ఉన్నారు.
ఇప్పటికే విడుదలైన పెద్ది గ్లింప్స్..
ఈ అద్భుతమైన మార్పును చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, ప్రశంసలతో పోస్టును నింపేస్తున్నారు. ‘పెద్ది’ గ్లింప్స్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ప్రత్యేకమైన ఉత్సుకతను రేకెత్తించగా, బుచ్చిబాబు అందుకు దీటుగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా చరణ్ కొత్త లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Changeover for @PeddiMovieOffl begin!!
Pure grit. True Joy. 💪🏻 pic.twitter.com/trhvrG7wyA
— Ram Charan (@AlwaysRamCharan) July 21, 2025
రామ్ చరణ్ 16వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘పెద్ది’లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ గౌర్నాయుడుగా కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని, ఇది క్రికెట్ నేపథ్యంతో ఉంటుందని బుచ్చిబాబు గతంలో తెలిపారు.

‘పెద్ది’ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ సుకుమార్‌తో మరోసారి జట్టుకట్టనున్నారు. ఇలా బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్‌లతో చరణ్ తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
