Vishal Marriage Update: ఇంకా సింగిల్ గానే విశాల్
తెలుగు, తమిళ భాషల్లో హీరో విశాల్ కి మంచి గుర్తింపు ఉంది. అయితే విశాల్ తనకి కెరీర్ బిగినింగ్ లో వచ్చిన క్రేజ్ ని కొనసాగించలేకపోయారు. విశాల్ చివరగా మార్క్ ఆంటోని, రత్నం లాంటి చిత్రాల్లో విశాల్ నటించారు. ఇటీవల విశాల్ అనారోగ్యానికి గురై ఆ తర్వాత కోలుకోవడం చూశాం. విశాల్ తనకి 47 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్నాడు.
గతంలో చాలాసార్లు విశాల్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. గతంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ ఘాటుగా ప్రేమాయణం సాగించారు. అయితే వీళ్లిద్దరి ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు. వరలక్ష్మి మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ. విశాల్ మాత్రం సింగిల్ గానే ఉన్నాడు. అయితే కొన్ని నెలల క్రితం విశాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.
విశాల్, సాయి ధన్సిక పెళ్లి వాయిదా
నటి సాయి ధన్సికతో విశాల్ రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని విశాల్, సాయి ధన్సిక అధికారికంగా ప్రకటించారు. ఆగష్టు 29న తమ పెళ్లి ఉండబోతోందని ప్రకటించారు. కానీ తాజా సమాచారం మేరకు వీళ్లిద్దరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. విశాల్ సన్నిహితుల నుంచే ఈ సమాచారం బయటకు వచ్చింది. విశాల్ పెళ్లి కోసం ఫ్యాన్స్ కి మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేవు.

పంతం పట్టిన విశాల్
అయితే పెళ్లి ఎందుకు వాయిదా పడింది అనే దానిపై ఆసక్తికర కారణం వినిపిస్తోంది. విశాల్ గతంలో నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఆ నడిగర్ సంఘం భవనంలోనే తన పెళ్లి ఉంటుందని విశాల్ గతంలో మాట ఇచ్చాడు. తన మాటని నిలబెట్టుకునేందుకు విశాల్ గట్టిగా పంతం పట్టేసినట్లు ఉన్నారు.
Nidhhi Agerwal About Panchami role : మేకప్ కోసమే రెండు గంటలు, నా పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉంటుంది.. ఊరిస్తున్న పంచమి
ప్రస్తుతం నడిగర్ సంఘం భవనం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు అంతస్తులు పూర్తయ్యాయి.మూడో అంతస్థులో కల్యాణ మండపం నిర్మిస్తున్నారు. అది కూడా పూర్తి కావచ్చింది. ఆ కల్యాణ మండపంలోనే విశాల్ తన పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నడిగర్ సంఘం కల్యాణమండపంలో జరిగే తొలి పెళ్లి విశాల్, సాయి ధన్సిక లదే అని అంటున్నారు.