Raja Saab: రాజాసాబ్ నుంచి సంజూ భాయ్ లుక్ ఔట్.. ప్రభాస్ తాత గెటప్ మామూలుగా లేదుగా..!
Raja Saab: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఒక సంచలన పోస్టర్‌ను విడుదల చేశారు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రభాస్‌కు తాత పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ‘రాజా సాబ్’ నుండి ఆయనకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ పొడవాటి జుట్టు, గడ్డంతో హారర్ లుక్‌లో కనిపించారు. అయితే, ఈ లుక్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సంజయ్ దత్ హారర్ లుక్..
‘రాజా సాబ్’ పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ హారర్ లుక్ చూసిన కొందరు, హారర్ సినిమా అంటే భయంకరంగా ఉండాలి కానీ ఇంత కామెడీగా ఉందేంటి అని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ తాతకు భయానక లుక్ సెట్ అవ్వలేదని, చాలా కామెడీగా ఉందని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
చేతిలో పూల బొకే పట్టుకుని అద్దంలోచూసుకుంటూ..
ఇప్పటికే విడుదలైన ‘రాజా సాబ్’ గ్లింప్స్‌లో ప్రభాస్ స్టైలిష్‌గా, చేతిలో పూల బొకే పట్టుకుని అద్దంలో తనను తాను చూసుకుంటూ, పూలు చల్లుకుంటూ కనిపించి అభిమానులను అలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ కూడా రికార్డు బ్రేకింగ్ వ్యూస్‌తో పరిశ్రమలో చర్చనీయాంశంగా నిలిచింది. డిసెంబర్ 5న విడుదల కానున్న ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
