Urvashi Rautela: వయ్యారాలు ఒలకబోస్తూ చూపించింది, దొంగలెత్తుకెళ్లే సరికి ఏడ్చేస్తోంది.. అసలేమైందంటే?
Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. తన డియోర్ బ్యాగ్ చోరీకి గురైందని, అందులో దాదాపు రూ. 70 లక్షల విలువైన నగలు ఉన్నాయని ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. వింబుల్డన్ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు ముంబై నుంచి లండన్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తన లగేజీ బ్యాగేజ్ బెల్ట్ ప్రాంతంలో కనిపించలేదని, చోరీకి గురైనట్లు ఊర్వశి రౌతేలా ఆరోపించారు.
ఊర్వశి అసహనం, ఎందుకంటే..?
ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఊర్వశి, ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో భద్రతా లోపాలను ప్రశ్నిస్తూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. “ముంబై నుంచి ఎమిరేట్స్ విమానం ద్వారా లండన్ వెళ్లాను. అక్కడ గాట్విక్ విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైంది. ఈ ఘటనతో నేను చాలా బాధపడ్డాను. విమానాశ్రయ అధికారుల నుంచి కూడా నాకు సరైన సహకారం అందడం లేదు” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. బ్యాగేజ్ ట్యాగ్, టికెట్ ఉన్నప్పటికీ తన బ్యాగ్ కనిపించకపోవడం తీవ్రమైన భద్రతా లోపాన్ని సూచిస్తోందని ఊర్వశి వాపోయారు.
https://www.instagram.com/reel/DMw3KW4oyJD/?utm_source=ig_embed&ig_rid=8e0a2721-105e-408d-a9ce-43058a45ccc6
అయ్యో పాపం ఊర్వశి అంటూ కామెంట్లు..
ఈ విషయం నెటిజన్లలో కూడా చర్చనీయాంశమైంది. ఊర్వశి పోస్ట్‌పై స్పందిస్తూ, కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆమె బ్యాగ్ పోగొట్టుకున్న మొట్టమొదటి హీరోయిన్ అని కామెంట్లు చేస్తున్నారు. ఊర్వశి చివరగా సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ చిత్రంలో కనిపించారు. అంతకు ముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘డాకూ మహరాజ్’ సినిమాలోనూ నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘బ్లాక్ రోజ్’, హిందీలో ‘వెల్‌కమ్ టు ది జంగల్’, ‘కసూర్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.