Keerthy Suresh: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కీర్తి సురేష్.. ఏం అందం సామీ..?
Keerthy Suresh: నటి కీర్తి సురేశ్ తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కేవలం ప్రతిభతోనే కాకుండా.. తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్‌లో ఆమె ఒక మల్టీకలర్, లుడో ఆట థీమ్‌తో ఉన్న డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రత్యేకమైన స్టైలిష్ లుక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కీర్తి సురేశ్ ప్రస్థానం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమె బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ‘పైలట్స్’ సినిమాతో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆమె ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అయితే ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా ‘మహానటి’. ఇందులో ఆమె అలనాటి నటి సావిత్రి పాత్రను పోషించి, తన అద్భుతమైన నటనకు జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ సినిమా కీర్తిని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసింది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి పలు భాషల్లో నటించిన కీర్తి సురేశ్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఒక విలక్షణ నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటన, కళ్లతో పలికించే భావాలు, సహజమైన ప్రదర్శనలకు అభిమానులు ముగ్ధులయ్యారు. అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం ఆమె కెరీర్‌కు చిన్నపాటి అడ్డంకిగా మారింది. అయినప్పటికీ.. కీర్తి సురేశ్ తన ప్రతిభపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రివాల్వర్ రీటా’ మరియు ‘కన్నివేది’ వంటి సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలు మంచి విజయం సాధించి, ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. సొషల్ మీడియాలో ఆమె తాజా లుక్ వైరల్ అవ్వడంతో.. కీర్తి సురేశ్ ఫ్యాషన్ సెన్స్, ఆమె కొత్త సినిమాల గురించి అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. ఈ ఫోటోషూట్ ఆమె కేవలం నటిగానే కాకుండా ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఎదగగలరని నిరూపించింది. ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ చాలా అందంగా ఉన్నావు, తెలుగు సినిమాల్లో కూడా నటించమని చెబుతున్నారు. ముఖ్యంగా నీ లూడో డ్రెస్ చాలా బాగుందంటూ వివరిస్తున్నారు.