Balakrishna: మెడలో నిమ్మకాయల దండతో బాలకృష్ణ మాస్ స్టెప్స్.. ఎక్కడంటే?
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్‌లపై అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సీక్వెల్‌లో బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరింత పవర్ఫుల్‌గా చూపించనున్నారు. అదే సమయంలో, ఆయన తన జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అమరావతిలో ఇటీవల భూమిపూజ చేశారు. 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆస్పత్రి, హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రికి అనుసంధానంగా ఉండనుంది.
అల్లు అరవింద్‌తో కలసి బాలయ్య సందడి
ఇక తాజాగా, బాలయ్య మరోసారి తన ఎనర్జీతో అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రముఖ నిర్మాత, ‘ఆహా’ ఓటీటీ అధినేత అల్లు అరవింద్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై బాలయ్య, అల్లు అరవింద్, ఇతర ప్రముఖులు నిమ్మకాయల దండలు ధరించి ఫుల్ ఫార్మల్ డ్రెస్సులో కనిపించారు. ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా మారిన సందర్భంలో, ‘పుష్ప 2’లోని ఎనర్జిటిక్ పాట ప్లే అవ్వడంతో బాలయ్య తనదైన స్టైల్‌లో తొడకొట్టి, చిల్ అవుతూ అభిమానులను అలరించారు.
https://x.com/BunnyMailapalli/status/1955591965824946495
వైరల్ అవుతున్న బాలయ్య ‘పుష్ప’ స్టెప్స్
బాలకృష్ణతో పాటు, వేదికపై ఉన్న అల్లు అరవింద్‌తో సహా అందరూ ‘పుష్ప’ సినిమా సిగ్నేచర్ మూవ్‌ను రిపీట్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలయ్య ఎనర్జీ, డ్యాన్స్ మూమెంట్స్‌పై అభిమానులు “బాలయ్య బాబు తగ్గేదేలే!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. ఈ షో ద్వారా బాలయ్య టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో, బాలయ్య, అల్లు అరవింద్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ కూడా పెరుగుతోంది.
