Janhvi Kapoor: భారత్ మాతాకీ జై.. కృష్ణాష్టమి వేడుకల్లో జాన్వీ నినాదాలు..
Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం, అక్కడ ఆమె చేసిన ఒక పని నెటిజన్ల విమర్శలకు గురైంది. పండుగ సంబరాల్లో భాగంగా ‘ఉట్టి కొట్టే’ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ.. ‘భారత్ మాతాకీ జై’ అని నినదించడంపై కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవానికి, కృష్ణాష్టమికి తేడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
ఈ ట్రోల్స్‌పై జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. వేడుకల్లో పాల్గొన్న వారు మొదట ‘భారత్ మాతాకీ జై’ అని నినదించారని, ఆ తర్వాతే తాను వారిని అనుసరించి ఆ నినాదం చేశానని వివరించారు. ఈ సందర్భాన్ని ఒక వర్గం వారు వీడియోలో తన మాటలను మాత్రమే కత్తిరించి వైరల్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పొగడటానికి ఒక ప్రత్యేక రోజు అంటూ ఉండదని, తాను జన్మాష్టమి రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ‘భారత్ మాతాకీ జై’ అని అంటానని గట్టిగా చెప్పారు.
తనపై వచ్చిన ట్రోల్స్‌ను జాన్వీ ఎదుర్కొన్న తీరును తన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ధైర్యంగా స్పందించిన తీరును చాలామంది అభినందించారు. ఈ వివాదాన్ని పక్కన పెడితే, కృష్ణాష్టమి వేడుకలో జాన్వీ తన మరాఠీ భాషతో అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కొత్త సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు.
https://www.instagram.com/reel/DNcgCQyS-Vo/?utm_source=ig_web_copy_link
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పరమ్ సుందరి’ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో జాన్వీ కేరళ అమ్మాయిగా, సిద్ధార్థ్ దిల్లీ అబ్బాయిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో “ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది” అనే డైలాగ్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.