Tamannaah Bhatia: అందంతో మాయ చేస్తున్న తమన్నా.. సంప్రదాయ గాగ్రాలో మిల్కీ బ్యూటీ మెరుపులు!
Tamannaah Bhatia: తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి తమన్నా భాటియా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మిల్కీ బ్యూటీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన తాజా ఫోటోషూట్‌తో అభిమానులను మరోసారి ఫిదా చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో తమన్నా మెరిసిపోతూ, నెట్టింట చర్చకు దారితీశారు.
తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోల్లో తమన్నా లేహంగా – గాగ్రాలో కనిపించారు. ఎప్పటిలాగే తన అందంతో, ఆత్మవిశ్వాసంతో పోజులిచ్చారు. ఆమె క్యూట్ లుక్స్, పాతకాలపు అందాన్ని గుర్తుచేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ఫోటోలను లైక్స్, కామెంట్లతో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తమన్నా భాటియా కెరీర్ విషయానికొస్తే, ఆమె ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో ‘శ్రీ’ సినిమాతో అడుగుపెట్టి, ‘హ్యాపీడేస్’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. ఆమె నటించిన సినిమాలు ‘బాహుబలి’, ‘జైలర్’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాలతో తమన్నా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఈమె స్టార్ హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారితో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని హిందీ చిత్రాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తమన్నా, తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు.
ప్రస్తుతం తమన్నా భాటియా బాలీవుడ్ లో సందడి చేస్తోంది. చివరిగా భోళా శంకర్, జైలర్, ఓదెల 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. జైలర్ తో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇదెలా ఉంటే.. తమన్నా భాటియా సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. మిల్క్ బ్యూటీకి ఇన్ స్టా గ్రామ్ లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఈ క్రమంలో తన అభిమానులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది.