Little Hearts Teaser: లిటిల్ హార్ట్స్.. టీజర్ అదిరింది భయ్యా.. ఫుల్ జోష్ ఫుల్ ఫన్ పక్కా..!
Little Hearts Teaser: సోషల్ మీడియాలో తన డైలాగులతో, ’90s మిడిల్ క్లాస్ బయోపిక్’ వీడియోలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యూట్యూబర్ మౌళీ తనూజ్, ఇప్పుడు ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో వెండితెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. శివానీ నాగారంతో జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలయ్యి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీజర్ చాలా బాగుందని, సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “లిటిల్ హార్ట్స్ అనగానే నాకు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో వెంకటేశ్ చేతిలో ఉన్న ప్యాకెట్ గుర్తుకొచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటుంది” అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
ఆ ఒక్క డైలాగ్ తప్పా.. మిగతాదంతా సూపర్..
టీజర్‌లో మౌళీ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. కాలేజీ లైఫ్, కుర్రాళ్ళ అల్లరి, ప్రేమ వ్యవహారాలు వంటి అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా శివానీ – మౌళీ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. అయితే, “ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దర్ని ఎందుకు కంటారో తెలుసా.. ఈ సొసైటీ పెట్టే ప్రెజర్‌కి ఒకడు పోయినా ఇంకొకడు ఉంటాడని..” అనే ఒక డైలాగ్‌పై నెటిజన్ల నుంచి కొంత విమర్శ ఎదురవుతోంది. ఈ డైలాగ్ వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అది హిట్.. మరి ఇది?
‘లిటిల్ హార్ట్స్’ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో తనదైన ముద్ర వేసిన మౌళి, వెండితెరపై ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాలి. ఈ సినిమా అతడి కెరీర్‌కు ఒక కీలక మలుపు అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.