NTR Neel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం రూ.15 కోట్లతో భారీ సెట్..!
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ఏకంగా రూ.15 కోట్లతో ఒక భారీ హౌస్ సెట్‌ను నిర్మిస్తున్నారని, ఈ బడ్జెట్ విని చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోతోంది. కేవలం ఒక సెట్‌కే ఇంత భారీ వ్యయం చేయడంతో సినిమా గ్రాండియర్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ స్టామినాను చాటిచెప్పేలా..
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల ‘వార్ 2’ ప్రమోషన్స్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మళ్లీ ఈ సినిమాపై దృష్టి సారించారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి హైదరాబాద్‌లో జరిగే తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ స్టామినాను మరోసారి చాటి చెప్పేలా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు చూడని డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో తన మార్క్ చూపించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.