Kavya Thapar: ఇస్మార్ట్ అందాలభామ పరువాల విందు.. కావ్య థాపర్ వయ్యారాలకు ఫిదా
Kavya Thapar: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి కావ్య థాపర్ తన తాజా ఫోటోషూట్‌తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. ఊదా రంగు స్టైలిష్ డ్రెస్‌లో ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంటె చూపులు, చిరునవ్వుతో కావ్య థాపర్ అందాన్ని రెట్టింపు చేశాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మహారాష్ట్రలో జన్మించిన కావ్య థాపర్, తన విద్యాభ్యాసాన్ని ముంబైలో పూర్తి చేశారు. నటనపై ఆసక్తితో తొలుత 2013లో ‘తత్కాల్’ అనే హిందీ షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. ఆ తర్వాత పతంజలి, మేక్ మై ట్రిప్ వంటి పలు ప్రముఖ సంస్థల ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులోకి 2018లో ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో అడుగుపెట్టినప్పటికీ, 2021లో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ఆమెకు మంచి ఫేమ్ లభించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది.

ఇటీవల రవితేజ సరసన ‘ఈగల్’ సినిమాలో, అలాగే రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో నటించి యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బిచ్చగాడు 2, ఏక్ మినీ కథ, ఊరు పేరు భైరవకోన, డేగ వంటి మూవీస్‌లో నటించారు కావ్య. రీసెంట్‌గా గోపీచంద్ విశ్వం మూవీలో నటించారు కావ్య. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

చీరకట్టులో మోడ్రన్‌గా కనిపిస్తూనే ఒయ్యారాలు ఒలకబోశారు కావ్య. ‘ప్రశాంతతలో తన లయను తాను కనుగొనేలా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఫోటోషూట్‌లో కావ్య థాపర్ గ్లామర్, స్టైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ ఫోటోస్, క్యూట్ లుక్స్‌తో లేటెస్ట్ స్టిల్స్ అదిరిపోయాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్, గ్లామరస్ లుక్స్‌తో టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తును సొంతం చేసుకోనున్నారని ఆమె అభిమానులు విశ్వసిస్తున్నారు.
