రవి ప్రకాష్ లేని టీవీ9ని ఎవరూ ఊహించలేదు. టీవీ9 లో రవి ప్రకాష్ కనిపించడు అసలు అనుకోలేదు. ఎక్కడ అయితే కూర్చొని న్యూస్ చదివాడో అక్కడే తన గురించి న్యూస్ వస్తుంది అని రవిప్రకాష్ కలలో కూడా ఊహించి ఉండడు. కానీ అదే జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త myhomes గ్రూప్ అధినేత రామేశ్వర రావు టీవీ9 దక్కించుకున్న తర్వాత సంస్థలో విభేదాలు తలెత్తాయి. యాజమాన్యం మార్పు తర్వాత రవి ప్రకాష్ ని ఛానల్ నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇపుడు ఛానల్ లో మళ్లీ ఎడిటోరియల్ వివాదాలు మొదలయినట్లు తెలుస్తుంది. త్వరలోనే రజినీకాంత్ ని సాగనంపడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీ9 లో రజినీకాంత్ నిర్వహించే బిగ్ డిబేట్ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. రజనీ తర్వాత స్థానంలో ఉన్న మురళీకృష్ణ తో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్టు టాక్. అధికారికంగా ఇటు టీవీ 9 నుండి గాని అటు రజినీకాంత్ నుండి గాని ఎటువంటి ప్రకటనా రాకపోయినా మీడియా సర్కిల్లో, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది కొంత కాలం వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.
