Rashi Singh: రాశీ సింగ్ అందాల విందు.. బ్లాక్ డ్రెస్‌లో బుట్టబొమ్మలా కనిపిస్తూ..!
Rashi Singh: టాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హీరోయిన్ రాశీ సింగ్.. తాజాగా చేసిన ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో ఆమె దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్‌లో రాశీ సింగ్ అందాలు, వయ్యారాలు యువతను ఆకట్టుకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాశీ సింగ్ మొదటగా ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. కానీ, సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి నటనవైపు అడుగులు వేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెకు అవకాశం ఇవ్వడంతో 2021లో వచ్చిన ‘శశి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత ‘ప్రేమ్ కుమార్’, ‘భూతద్దం భాస్కర నారాయణ’, ‘ప్రసన్న వదనం’, ‘బ్లైండ్ స్పాట్’ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆమెకు ఆశించిన స్థాయిలో హిట్లు లభించలేదు. దీంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చి ఇక్కడే ఉంటూ మంచి పాత్రల కోసం ప్రయత్నిస్తున్నారు. మంచి ప్రేమకథలో నటించాలని, గ్లామరస్ పాత్రలు పోషించడానికి కూడా వెనుకాడనని రాశీ సింగ్ పలు సందర్భాల్లో తెలిపారు.
తన వ్యక్తిగత జీవితం, సినిమాల విషయాలను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో పంచుకునే రాశీ సింగ్.. తాజాగా ఈ ఫోటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె చాలా అందంగా కనిపిస్తుండగా.. కుర్రకారు మొత్తం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్లాక్ డ్రెస్సులో భలే అందంగా ఉన్నావంటూ చెప్పుకొస్తున్నారు. నీ ఒంపుసొంపులు చూసి తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.