Pawan Kalyan: దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చిరు విషెస్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ రిప్లై
Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి చేసిన ట్వీట్, దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతిస్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను పంచుకున్నారు. “దీర్ఘాయుష్మాన్ భవ” అంటూ చిరంజీవి తన తమ్ముడికి ఆశీస్సులు అందించారు. ఈ పోస్ట్‌కు బదులుగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంది. పవన్ తన అన్నయ్యను ‘మార్గదర్శి’, ‘తండ్రి సమానులు’ అని పేర్కొంటూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
“మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది” అని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి ఆశీస్సులు, ప్రేమ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని, ఆయన ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని పవన్ ఆకాంక్షించారు. మెగాస్టార్ ఇచ్చిన ఆశీస్సులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలపడం మెగా అభిమానులందరికీ సంతోషాన్ని కలిగించింది.
https://x.com/PawanKalyan/status/1962749870961500213
పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. “మీ నిస్వార్థమైన స్వభావాన్ని చూస్తూ పెరగడం నా అదృష్టం” అని రామ్ చరణ్ పోస్ట్ చేయగా, అల్లు అర్జున్ “మన పవర్‌స్టార్‌కు శుభాకాంక్షలు” అంటూ విషెస్ తెలిపారు. ఈ పుట్టినరోజు సందర్భంగా, పవన్‌కు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
