Chiranjeevi: ‘మన శంకర్ వరప్రదాస్ గారు’ నుంచి క్రేజీ అప్డేట్.. ఏంటంటే?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి తొలిసారి కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ గురించి చిత్ర యూనిట్ కీలకమైన అప్డేట్ను పంచుకుంది. కేరళలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి 19 వరకు శరవేగంగా జరగనుంది. ఈ షెడ్యూల్లో రెండు ముఖ్యమైన పాటలతో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, అక్టోబర్ మొదటి వారంలో జరగబోయే షెడ్యూల్లో విక్టరీ వెంకటేశ్ జాయిన్ కానున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో వెంకటేశ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుండడం విశేషం.
కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాతో మెగాస్టార్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవిలోని స్టైలిష్ యాక్షన్, అనిల్ రావిపూడి కామెడీ టచ్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో కూడా నటిస్తున్నారు, అది వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.