Bigg Boss Telugu 9: రీతూ తలకు గాయం, హాట్ టాపిక్‌గా సంజనా గల్రానీ..
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొలివారంలోనే ఉత్కంఠను పెంచుతోంది. సాధారణంగా మొదటి వారంలో నామినేషన్స్ సిల్లీ కారణాలతో జరుగుతుంటాయి. కానీ, ఈసారి ఓనర్స్, టెనెంట్స్ మధ్య మొదటి నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. ముఖ్యంగా నటి సంజనా గల్రానీ తన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించి, తొలివారంలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చిరాకు పడటం, తరచూ గొడవలకు దిగడంతో ఓనర్స్ ఆమెను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు.
సంజనా తీరుతో ఇంట్లో ఉన్న వాళ్లందరూ విసిగిపోయారు. వాష్‌రూమ్ దగ్గర ఫ్లోరాతో సంజనాకు పెద్ద గొడవ జరిగింది. బాత్రూమ్లో షాంపూలు, కండీషనర్లు పెట్టవద్దని ఫ్లోరా చెప్పగా, సంజనా దానికి అడ్డంగా వాదించింది. దీంతో ఫ్లోరా “నేనేమైనా నీ పనిమనిషినా?” అని ప్రశ్నిస్తూ నిలదీయగా, సంజనా ఆగ్రహంతో ఫ్లోరాను “మ్యానర్స్ లేదని” అంటూ పరుష పదజాలంతో దూషించింది. ఈ సంఘటనతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది.
‘ఫుటేజ్ కోసమే’ అంటూ శ్రీజ కామెంట్..
ఈ గొడవను చూసిన మరో కంటెస్టెంట్ శ్రీజ, సంజనా ఫుటేజ్ కోసం ఇదంతా చేస్తుందని కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయిన సంజనా, శ్రీజపై కోపంతో ఊగిపోయింది. ఆమెను “చీప్” అని తిడుతూ, “వేలు చూపిస్తూ మాట్లాడొద్దు” అని వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ఇమ్మాన్యుయేల్‌తో మాట్లాడుతూ శ్రీజను “సైకో” అని, “ఆమెను చూస్తే చిరాకు” అని వ్యాఖ్యానించింది.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా, టెనెంట్స్‌లో ఒకరిని వారే నామినేట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ ఇద్దరు టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి సుత్తిని అందుకోవాలి. ఈ క్రమంలో రీతూ పాకుతూ ఉండగా, పక్కనే ఉన్న పోల్ తగలడంతో ఆమె తలకు గాయమైంది. వెంటనే ఆమెను మెడికల్ రూమ్‌కు పంపించి చికిత్స అందించారు.
నామినేషన్ల ప్రక్రియలో హైలైట్స్
ఈ నామినేషన్ ప్రక్రియలో తనుజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. షోలో చాలా మౌనంగా ఉంటున్న సుమన్ శెట్టి, ఈసారి నోరు విప్పినా తనను తాను సరిగా సమర్థించుకోలేకపోయారు. మిగతా నామినేషన్లు నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి. ఈ తొలివారం ఎపిసోడ్లు ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తున్నాయనడంలో సందేహం లేదు.