Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’కి సెన్సార్ పూర్తి.. సర్టిఫికేట్ ఏమిచ్చారంటే?
Pawan Kalyan: ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ ఒకటి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, U/A సర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రంలోని యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌కు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఆయన స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను కచ్చితంగా మైమరపిస్తాయని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ముఖ్యంగా, థమన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా హైప్ మరింత పెంచాయి.
ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సాంకేతిక విలువలు, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో ‘ఓజీ’ పాన్ ఇండియా స్థాయి ప్రమాణాలతో రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం, పవన్ అభిమానులకే కాకుండా, యాక్షన్ సినిమా ప్రియులందరికీ ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, సినిమా ప్రమోషన్స్ మరింత వేగవంతం కానున్నాయి.
ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన అప్డేట్ను విడుదల చేసింది. సినిమాలో ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్ పోషిస్తున్న కీలక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. పోస్టర్లో ప్రకాష్ రాజ్ ‘సత్య దాదా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సీరియస్ లుక్‌తో ఉన్న ఆయన పాత్ర సినిమా కథకు చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా, పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న పవన్ కల్యాణ్ పాత్రకు, ప్రకాష్ రాజ్ పాత్రకు మధ్య ఎలాంటి ఘర్షణ ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.