Ananya Nagalla: చీరకట్టులో పరువాల ప్రదర్శన.. అనన్య నాగళ్ల అందానికి అల్లాడిపోవాల్సిందే
Ananya Nagalla: తన సహజ నటన, అందంతో యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి అనన్య నాగళ్ల. ఈ బ్యూటీ తన అందాల ఆరబోతతో యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. మోడర్న్ దుస్తులు వేసినా, సాంప్రదాయ చీర కట్టినా తన ఫాలోయర్స్‌కు ఏం కావాలో అది మాత్రం పక్కాగా ఇచ్చేస్తుంది అనన్య.
చాలానే సినిమాల్లోనే నటించినప్పటికీ.. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే.. తన హాట్ హాట్ అందాల ఆరబోతతోనే అనన్యకు కుర్రకారులో ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది.
తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించిన అనన్య, బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు. అయితే నటనపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో ‘షాదీ’ అనే లఘు చిత్రంతో తన ప్రయాణం మొదలుపెట్టి, 2019లో ప్రియదర్శి సరసన ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అనన్యకు వరుస అవకాశాలు లభించాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘తంత్ర’, ‘పొట్టెల్’, ‘డార్లింగ్’, ‘శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్’ వంటి చిత్రాలలో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇది ఆమె సినీ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.
సినిమాలతో పాటు, అనన్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటారు. మోడర్న్ దుస్తుల నుండి వెస్టర్న్ వేర్, సాంప్రదాయ చీరలు, హాఫ్ శారీలో కవ్వించే ఫోజులతో మైమరిపిస్తుంది అనన్య నాగళ్ల. ఈ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనన్య అందానికి, అద్భుతమైన నటనకు ఒక స్టార్ హీరో సరసన అవకాశం వస్తే టాలీవుడ్లో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రలను పోషిస్తారని సినీ విశ్లేషకులు కూడా ఆశిస్తున్నారు.