Devara 2: ‘దేవర 2’కు రెడీగా ఉండండి.. రెట్టింపు యాక్షన్‌తో రాబోతున్న తారక్ – కొరటాల
Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’ విడుదలై నేటితో (సెప్టెంబర్ 27) సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ, నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
‘దేవర 2’ కోసం అందరూ సిద్ధంగా ఉండాలని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “దేవర సముద్ర తీరాన్ని వణికించి నేటికి ఏడాది పూర్తయింది. తాను పంచిన ప్రేమ, తాను చూపిన భయం.. ఎప్పటికీ మర్చిపోలేరు. దేవర 2 కోసం అందరూ సిద్ధంగా ఉండండి” అని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో త్వరలోనే ఈ సీక్వెల్ పనులను ప్రారంభించనున్నట్లు స్పష్టమవుతోంది.
రెండో భాగంపై భారీ అంచనాలు
‘దేవర’ విజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ఈ సీక్వెల్‌పై అంచనాలను పెంచేశారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ.. మొదటి భాగం కంటే రెండో భాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. పార్ట్ 1లో చూపించింది కేవలం 10 శాతమేనని, రెండో భాగంలో 100 శాతం మాస్ యాక్షన్ చూస్తారని ఆయన వెల్లడించారు. కథలోని ప్రతీ పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుందని కూడా ఆయన హింట్ ఇచ్చారు.
ఎన్టీఆర్ కూడా ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ, మొదటి భాగం విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందని, ‘దేవర’ కంటే దాని సీక్వెల్ ఇంకా బాగుంటుందని పలు సందర్భాల్లో వెల్లడించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ భారీ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వెంటనే, ఎన్టీఆర్ ‘దేవర 2’ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
