Karan Johar: ఒకప్పుడు బాలీవుడ్‌లో కింగ్ మేకర్ కరణ్ జోహార్.. ఇప్పుడేమో కనీసం దేకట్లేదు
Karan Johar: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన తాజా చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ విడుదలకు ముందే అనూహ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకకపోవడం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుండగా, అదే రోజు కన్నడ బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’కు ప్రీక్వెల్ అయిన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా రిలీజ్ కావడం గమనార్హం.
‘కాంతార’ సినిమా హిందీలో సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, దాని ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా, మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెజారిటీ స్క్రీన్లు ‘కాంతార: చాప్టర్ 1’కే దక్కాయి. దీంతో, కరణ్ జోహార్ నిర్మించిన సినిమాకు సరైన థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. ‘బాహుబలి’ని హిందీలో విడుదల చేసి పాన్-ఇండియా సినిమాలకు ద్వారాలు తెరిచిన కరణ్ జోహార్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం విశేషం. థియేటర్లు ఇవ్వాలని అడిగే స్థాయికి ఆయన వచ్చారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హీరోయిన్ జాన్వీ కపూర్ కెరీర్ విషయంలో కూడా ఈ సినిమా చాలా కీలకం. ఏడేళ్ల కిందట ‘ధడక్’తో పరిచయమైన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌లో ఒక్క హిట్ కూడా సాధించలేదు. ఇటీవలే ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ హిట్టయినా, ఆ క్రెడిట్ ఎక్కువగా ఎన్టీఆర్‌కే దక్కింది. ఈ నేపథ్యంలో, దసరా సీజన్‌లో విడుదలవుతున్న ‘సన్నీ సంస్కారి…’ కచ్చితంగా విజయం సాధించాలని జాన్వీ అభిమానులు ఆశిస్తున్నారు. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్‌తో కలిసి ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. థియేటర్ల సమస్య మధ్య ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.