SS Thaman: క్రికెట్ దేవుడితో తమన్.. సచిన్ టెండూల్కర్‌తో తన జర్నీ గురించి తమన్ ఎమోషనల్
SS Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన మ్యూజిక్‌తో పాటు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపరమైన అప్డేట్స్తో అభిమానులను ఎప్పుడూ ఎంగేజ్ చేస్తుంటారు. ఈసారి ఏకంగా ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్‌తో తనకు ఎదురైన ఓ అరుదైన క్షణాన్ని పంచుకుంటూ తమన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
డల్లాస్ నుంచి దుబాయ్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ తమన్‌కు తోడుగా ఉన్నారు. ఆ ప్రయాణం తనకు మరపురాని అనుభూతిని ఇచ్చిందని తమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సచిన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
“డల్లాస్ నుంచి దుబాయ్ వరకు లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారితో కలిసి ప్రయాణించడం గొప్ప అనుభవం. ఈ ప్రయాణంలో మేమిద్దరం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచ్‌లలో నేను బ్యాటింగ్ చేసిన వీడియోలను ఆయనకు చూపించాను. ఆ వీడియోలు చూసిన వెంటనే సచిన్ గారు, ‘నీ బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉంది’ అని ప్రశంసించారు. నా జీవితంలో ఇదొక గొప్ప క్షణం,” అని తమన్ ఎంతో సంతోషంగా పంచుకున్నారు.
అంతేకాదు, తమన్ తన పోస్ట్‌లో చివరగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు అభిమానులలో కొత్త చర్చకు దారి తీసింది. “త్వరలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావొచ్చు” అని తమన్ పేర్కొనడంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సచిన్ సినిమాల్లోకి వస్తున్నారా, లేక తమన్ ఆయన బయోపిక్కు సంగీతం అందిస్తారా, లేదా ఏదైనా క్రికెట్ సంబంధిత ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తమన్ కేవలం సంగీతంలోనే కాక, తెలుగు వారియర్స్ తరఫున సీసీఎల్‌లో తన బ్యాటింగ్‌తో జట్టుకు అనేక విజయాలు అందించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’కి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తమన్, బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.