Rashi Khanna: టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన రాశీ ఖన్నా.. ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు
Rashi Khanna: టాలీవుడ్లో దశాబ్దానికి పైగా గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి రాశీ ఖన్నాకు ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో సోలో ఐడెంటిటీ దక్కలేదనే చెప్పాలి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్డమ్ ఉన్న టైర్-1 హీరోలతో నటించే అవకాశాలు ఆమెకు తక్కువగా వచ్చాయి. తన కెరీర్ ఆరంభంలో ‘బొద్దుగా’ ఉందన్న విమర్శలు ఎదురైనా, దాన్ని సవాలుగా తీసుకుని స్లిమ్‌గా మారినా, టాలీవుడ్లో ఆమెను సరిగ్గా ఉపయోగించుకోలేదనే అభిప్రాయం ఉంది. రాశీ ఫిల్మోగ్రఫీలో సోలో హీరోయిన్గా కన్నా, ఇతర హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలే ఎక్కువగా కనిపించడం ఆమె కెరీర్ హైలైట్‌గా నిలవలేకపోయింది.
టాలీవుడ్లో ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ వంటి ప్లాప్‌ల తర్వాత, ఆమె తన దృష్టిని పూర్తిగా కోలీవుడ్, బాలీవుడ్‌పై పెట్టింది. తమిళంలో ‘తిరు’, ‘సర్దార్’, ‘ఆరణ్మనై 4’ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్నా, హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
సుమారు రెండేళ్ల విరామం తర్వాత తెలుగులో రాశీ ఖన్నా ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో పలకరించబోతోంది. అయితే, ఈ సినిమాలో కూడా ఆమె శ్రీనిధి శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం.
ఈ సమయంలోనే, ఆమెకు బెస్ట్ బ్రేక్‌గా పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటించే అవకాశం దక్కింది. కానీ, ఇందులో కూడా శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి రావడం పట్ల ఆమె సంతోషపడాలో లేక ‘సెకండరీ’ ఫీలింగ్‌కు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఈ ‘తేరీ’ రీమేక్తోనైనా ఆమె అదృష్టం మారి, ఇకపై సోలో హీరోయిన్గా టైర్-1 హీరోలతో నటించే ఛాన్స్‌లు కొల్లగొడుతుందేమో చూడాలి.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డైట్ సీక్రెట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “చిన్నప్పటి నుంచి పరాఠా, మఖాన్ వంటి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కాస్త లావుగా ఉండేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక తెరపై అందంగా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే అని తెలుసుకున్నాను. బరువు తగ్గాలని నిర్ణయించుకుని, జిమ్‌ను నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను. ఇప్పుడు వర్కౌట్స్, యోగా వల్ల మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఉంటున్నాను,” అని తెలిపింది.
