కొన్ని సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ వచ్చింది. అభిమానులను ఉర్రూతలూగించి పాత రికార్డులను తుడిచిపెట్టింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్ డైరెక్షన్ లో కాంబినేషన్ సెట్ చేశాడు మరో వీరాభిమాని బండ్ల గణేష్. మొత్తానికి అభిమానూలు ఇద్దరు కలిసి తమ హీరోకు మర్చిపోలేని హిట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో పదేళ్ల తర్వాత చూపించారు.
చూస్తుంటే బండ్ల గణేష్ కు మరో మ్యాజిక్ చేసే అవకాశం లభించినట్టు ఉంది. “నా బాస్ ఓకే అన్నాడు. నా కల మరోసారి నిజమైంది. నా దేవుడికి ధన్యవాదాలు” అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగలాంటి వార్త చెప్పాడు బండ్ల గణేష్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ని షేర్ చేశాడు. వీళ్ల కాంబినేషన్లో గబ్బర్ సింగ్ లాంటి మరో సినిమా రావడం ఖాయమని అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ retweets చేస్తున్నారు. ఈ సినిమా ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని టాక్.
అయితే పవన్ ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసారు. టాకీపార్ట్ మాత్రం మిగిలి ఉంది. తదనంతరం హరిష్ శంకర్, క్రిష్ తో చిత్రాలు చెయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. ఆ చిత్రాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ చిత్రం చేసే అవకాశం ఉంది. ఏదేమైనా పవన్ అభిమానులకు ప్రియమైన నిర్మాత బండ్లగణేష్ ట్వీట్ కి వారి నుండి విశేష స్పందన లభించింది.