Samantha: మన సమంతనేనా.. అలా తయారైందేంటి.. వైరల్‌గా సమంత లేటెస్ట్ పిక్స్
Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు తాజాగా ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొనగా, ఆమె కొత్త రూపం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అందం, అభినయం కలగలిపిన నటిగా తన కెరీర్ ఆరంభం నుంచే వరుస విజయాలతో అగ్రస్థానానికి ఎదిగిన సమంత, అనూహ్యంగా ఎదురైన మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకుని, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
చికిత్స తర్వాత మళ్లీ మెల్లగా పబ్లిక్ ఈవెంట్లలో, సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్న సామ్ తాజా ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. మోడ్రన్ దుస్తుల్లో కనిపించిన సమంత, గతంలో ఉన్న గ్లో, ఫిట్‌నెస్‌తో పోలిస్తే కొంచెం బలహీనంగా, బరువు తగ్గినట్లు కనిపించడం నెటిజన్ల మధ్య ప్రధాన చర్చనీయాంశమైంది.
కొంతమంది అభిమానులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, “ఇదేనా మన సమంత… చాలా మారిపోయింది!”, “ఆరోగ్య సమస్యల కారణంగానే ఇంత బరువు తగ్గింది అనుకుంటా”, “ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. నటి ముఖంలో కనిపించిన తేడాపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే మరోవైపు సమంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఆమెకు అండగా నిలిచారు అభిమానులు. “ఇంతటి తీవ్రమైన వ్యాధి నుంచి కోలుకుంటూ, ఇంతటి బలమైన ఆత్మవిశ్వాసంతో బయటకు రావడం అందరికీ ఒక ప్రేరణ” అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా, ఆమె చూపుతున్న నిబద్ధత, సానుకూల దృక్పథం అభినందనీయం అని పేర్కొన్నారు. ఏదేమైనా, సమంత ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారుతోంది.
