• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Khushbu Sundar: ‘ఆమె బరువు నీకెందుకు? సిగ్గు లేదా’.. బాడీ షేమింగ్ జర్నలిజంపై ఖుష్బూ ఫైర్

Khushbu Sundar: 'ఆమె బరువు నీకెందుకు? సిగ్గు లేదా'.. బాడీ షేమింగ్ జర్నలిజంపై ఖుష్బూ ఫైర్

Sandhya by Sandhya
November 7, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Khushbu Sundar: ‘ఆమె బరువు నీకెందుకు? సిగ్గు లేదా’.. బాడీ షేమింగ్ జర్నలిజంపై ఖుష్బూ ఫైర్
Spread the love

Khushbu Sundar: ‘ఆమె బరువు నీకెందుకు? సిగ్గు లేదా’.. బాడీ షేమింగ్ జర్నలిజంపై ఖుష్బూ ఫైర్

 

Khushbu Sundar: నటీనటులు, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జర్నలిస్టుల అతి జోక్యం, ముఖ్యంగా మహిళల బాడీ షేమింగ్ పై ప్రశ్నలు వేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న చేదు అనుభవంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గౌరీ కిషన్ నటించిన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒక రిపోర్టర్ చేసిన ప్రశ్న వివాదానికి దారితీసింది. సినిమాలో ఒక పాట సన్నివేశంలో హీరో ఆదిత్య మాధవన్ గౌరీని ఎత్తుకొని తిప్పుతారు. దీనిని ప్రస్తావిస్తూ సదరు రిపోర్టర్ హీరోను ఉద్దేశించి “హీరోయిన్‌ను ఎత్తుకొని తిరిగేటప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? మీకు భారీగా అనిపించిందా?” అని పదే పదే అడగడం జరిగింది. మొదటి రోజు హీరో స్పందిస్తూ తాను జిమ్ చేస్తానని, అందుకే బరువు అనిపించలేదని సమాధానం ఇచ్చారు.

అయితే మరుసటి రోజు జరిగిన ప్రెస్ మీట్‌లోనూ అదే రిపోర్టర్ మళ్లీ గౌరీ బరువుపై ప్రశ్న వేయడంతో ఆమె సహనం కోల్పోయింది. “నా బరువు గురించి తెలుసుకుని మీరు ఏం చేయబోతున్నారు? ఇది బాడీ షేమింగ్.. మీరు ఒక స్త్రీని కేవలం వస్తువులా చూస్తున్నారు. నా పాత్ర గురించి, నటన గురించి ఒక్క ప్రశ్న కూడా లేదు. మగ నటుల్ని ఇలా అడగగల ధైర్యం మీకు ఉందా?” అంటూ ఆ రిపోర్టర్‌పై గౌరీ కిషన్ విరుచుకుపడ్డారు. ఇది సరదాగా అడిగిన ప్రశ్న అని కొందరు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, బాడీ షేమింగ్‌ను నార్మలైజ్ చేయడం ఆపాలని గౌరీ గట్టిగా స్పష్టం చేశారు.

ఈ వివాదంపై స్పందించిన నటి ఖుష్బూ ఎక్స్ వేదికగా జర్నలిస్టుల తీరును తప్పుబట్టారు. “జర్నలిజం తన విలువను కోల్పోతోంది. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు వృత్తి పరువును పాతాళానికి తీసుకుపోతున్నారు. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగడం ఎంత సిగ్గుచేటు!” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి ప్రశ్నలకు గట్టిగా నిలబడి, దీటైన సమాధానం చెప్పిన యువ నటి గౌరీ కిషన్‌ను ఆమె ప్రశంసించారు. “ఒకవేళ ఇదే ప్రశ్నను జర్నలిస్ట్ కుటుంబంలోని మహిళలను అడిగితే ఎలా స్పందిస్తారు? గౌరవం ఎప్పుడూ ఏకపక్షం కాదు. మీరు గౌరవం ఆశిస్తే, ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి” అని ఖుష్బూ స్పష్టం చేశారు. #RespectAllWomen, #shamefuljournalism వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించి, మహిళల పట్ల ప్రవర్తించాల్సిన తీరుపై ఆమె సందేశం ఇచ్చారు.


Spread the love
Tags: actress weightbody shamingGauri Kishanjournalism controversyKhushboo Sundarmovie promotionsఖుష్బూ సుందర్గౌరీ కిషన్జర్నలిజం వివాదంనటి బరువుబాడీ షేమింగ్సినిమా ప్రమోషన్స్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.