• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Sai Pallavi: తండేల్ తర్వాత మళ్లీ కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తున్నట్లు?

Sai Pallavi: తండేల్ తర్వాత మళ్లీ కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తున్నట్లు?

Sandhya by Sandhya
November 10, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Sai Pallavi: తండేల్ తర్వాత మళ్లీ కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తున్నట్లు?
Spread the love

Sai Pallavi: తండేల్ తర్వాత మళ్లీ కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తున్నట్లు?

 

Sai Pallavi: తెలుగు ప్రేక్షకులను ‘భానుమతి ఒక్కటే పీస్‌’ అంటూ ‘ఫిదా’ చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, తన అద్భుతమైన నటన, డాన్స్ టాలెంట్‌తో టాలీవుడ్‌లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో తన ప్రత్యేకమైన వ్యక్తిత్వం కారణంగా కొందరి నుంచి ‘ఎరోగెంట్ హీరోయిన్’ అనే ముద్ర వేయించుకున్నా, క్రమంగా ఆమె ఎంత ఇన్నోసెంట్ అమ్మాయో తెలుగు ప్రేక్షకులకు అర్థమైంది.

తాజాగా ఈ తమిళ నటి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘మేరీ రహో’ (తొలుత ‘ఏక్ దిన్’ టైటిల్‌తో ప్రారంభమైంది) తో ఆమె బాలీవుడ్ డెబ్యూ చేయబోతోంది. మొదట్లో ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయాలని అనుకున్నా, తర్వాత డిసెంబర్ 12న విడుదల చేస్తామని ప్రకటించారు.

అయితే సినిమా విడుదల తేదీకి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకపోవడం బీ-టౌన్ ప్రేక్షకులలో సందేహాలను కలిగిస్తోంది. కనీసం హీరోహీరోయిన్ల లుక్స్ కానీ, టీజర్ కానీ, పోస్టర్ కానీ విడుదల చేయకపోవడంతో, అనుకున్న సమయానికి సినిమా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సాయి పల్లవికి బాలీవుడ్‌లో తనను తాను నిరూపించుకోవడానికి చాలా ముఖ్యం.

మరోవైపు, సాయి పల్లవి ప్రతిష్టాత్మకమైన మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ రెండు భాగాల చిత్రంలో ఆమె ‘సీత’ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే రాముడు (రణబీర్ కపూర్), సీత (సాయి పల్లవి) గెటప్పుల్లో ఉన్న ఫోటోలు లీకై సోషల్ మీడియాలో భారీ ప్రశంసలు దక్కించుకున్నాయి. దీపావళి సందర్భంగా ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ అవుతుందని మేకర్స్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

‘రామాయణ్’ లాంటి భారీ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలతో పోలిస్తే, సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ చిత్రం ‘మేరీ రహో’ ప్రమోషన్ల విషయంలో వెనుకబడి ఉండడం ఆశ్చర్యకరం. ‘మేరీ రహో’లో ఆమె పోషిస్తున్న ‘నిషా’ పాత్ర లుక్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉన్నా, టీమ్ మాత్రం ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. మరి ‘మేరీ రహో’ చెప్పిన తేదీకే థియేటర్లలో సందడి చేస్తుందో లేదో వేచి చూడాలి.

 


Spread the love
Tags: Junaid Khan Meri RahoNatural Beauty Sai PallaviSai Pallavi Bollywood DebutSai Pallavi Bollywood ReleaseSai Pallavi Meri RahoSai Pallavi Ramayanజునైద్ ఖాన్ మేరీ రహోనేచురల్ బ్యూటీ సాయి పల్లవిసాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూసాయి పల్లవి బాలీవుడ్ విడుదలసాయి పల్లవి మేరీ రహోసాయి పల్లవి రామాయణ్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.