Rakul Preet Singh: బీచ్‌లో బికినీతో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh: టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన బాలీవుడ్ కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా వెలుగొందిన రకుల్, ఇటీవలి కాలంలో పూర్తిగా హిందీ సినిమాలపైనే దృష్టి సారించారు.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం అనంతరం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తూ, ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్నారు. భర్త ఆశీర్వాదం తీసుకున్న ఆ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ ఆదర్శవంతమైన జంట నుంచి గుడ్‌న్యూస్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కుటుంబ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, రకుల్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌ను ఏ మాత్రం విస్మరించడం లేదు. నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ నటి.. తన ఫ్యాషన్, ఫిట్నెస్ వీడియోలు, గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా, రకుల్ ప్రీత్ సింగ్ బీచ్ ఒడ్డున బికినీలో పోజులిచ్చిన ఫోటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆమె హాట్ హాట్ లుక్స్‌లో కనిపించారు. కత్తిలాంటి చూపులతో, అద్భుతమైన ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, రకుల్ నటిస్తున్న తాజా చిత్రం ‘దే దే ప్యార్ దే 2’ ట్రైలర్‌తో ఆమె మరోసారి చర్చల్లో నిలిచారు. ఈ సినిమాలో రకుల్ ‘ఆయేషా’ పాత్రను పోషిస్తున్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా, “మీరు చూశారా? ఆయేషా మీ మనసు దోచుకోవడానికి వస్తుంది” అంటూ ఆమె చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో తెలుగులో బ్రేక్ అందుకున్న రకుల్, అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. నటనతో పాటు వ్యాపారాలపై కూడా దృష్టి సారించిన రకుల్.. సంపాదించిన మొత్తాన్ని తెలివిగా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్‌కే పరిమితం కావడంతో, తెలుగు ప్రేక్షకులు ఆమెను డబ్బింగ్ చిత్రాల ద్వారా మాత్రమే అప్పుడప్పుడు పలకరిస్తున్నారు.
