Buchi Babu: రామ్ చరణ్ తర్వాత బాద్‌షా వంతు.. షారుఖ్ ఖాన్‌తో బుచ్చిబాబు సానా ₹500 కోట్ల ప్రాజెక్ట్!
Buchi Babu: ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన యువ ప్రతిభావంతుడు బుచ్చిబాబు సానా. చిన్న పాయింట్‌తోనూ ప్రేక్షకులను రెండు గంటల పాటు కట్టిపడేయగల తన ప్రత్యేక టేకింగ్‌తో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ‘పెద్ది’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, వీడియోలు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, అభిమానులు ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ‘పెద్ది’ చిత్రం సెట్స్‌పై ఉండగానే బుచ్చిబాబు తన కెరీర్‌లో మరో అత్యంత భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో తమ విస్తరణను వేగవంతం చేస్తోంది. తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, హిందీలో ‘జాట్’ వంటి చిత్రాలను ఇప్పటికే నిర్మిస్తున్న ఈ బ్యానర్, ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సూపర్ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు ఇటీవల బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను కలిసి ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపారట. అంతేకాకుండా, ఆయనకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దాదాపు ₹500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం బుచ్చిబాబు సానాకు దక్కినట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ నుంచి ‘పెద్ది’ వరకు తన వినూత్న శైలితో ఆకట్టుకున్న బుచ్చిబాబు, తన మూడో సినిమానే షారుఖ్ ఖాన్ లాంటి గ్లోబల్ స్టార్‌ను డైరెక్ట్ చేయడం నిజంగానే ఒక సంచలనం. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాతే షారుఖ్ ఖాన్ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా, మల్టీ-ఇండస్ట్రీ ప్రాజెక్టులతో బుచ్చిబాబు భవిష్యత్తులో ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
