Jailer 2: ‘జైలర్ 2’లో ఊహించని మెగా ట్విస్ట్.. రజనీకాంత్‌తో జతకట్టనున్న మరో స్టార్
Jailer 2: తమిళ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. ఈ సీక్వెల్‌కు సంబంధించిన నటీనటులపై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘జైలర్ 2’లో మరో స్టార్ నటుడు భాగం కాబోతున్నారని సమాచారం. తెలుగు, తమిళంతో సహా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సీక్వెల్లో కీలక పాత్ర పోషించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ‘జైలర్ 2’ షూటింగ్లో విజయ్ సేతుపతికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
రజినీకాంత్, విజయ్ సేతుపతి గతంలో ‘పేటా’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందన్న వార్తలపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘జైలర్ 2’ చిత్రం 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోందని రజినీకాంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పోషించిన పాత్రలు సీక్వెల్లో కూడా కొనసాగుతాయని వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్లో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు కోలీవుడ్ హాస్యనటుడు సంతానం కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని ఇండస్ట్రీ టాక్. ‘జైలర్’ మొదటి భాగంలో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత రవి, తమన్నాలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు సీక్వెల్లో విజయ్ సేతుపతి, విద్యాబాలన్ వంటి స్టార్స్ చేరడంపై రాబోయే రోజుల్లో చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
