Peddi Movie: చికిరి సాంగ్‌కు 100 మిలియన్ల వ్యూస్.. ‘పెద్ది’ టీం కష్టం చూశారా?
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా విడుదలైన ‘చికిరి’ పాట 100 మిలియన్ల వ్యూస్ (అన్ని భాషల్లో కలిపి) మార్క్‌ను దాటి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ పాట సాధించిన అద్భుతమైన ఆదరణ నేపథ్యంలో, చిత్ర యూనిట్ తాజాగా ‘చికిరి’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కోసం చిత్ర బృందం ఎంతగా శ్రమించిందో మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలోని పుణే – సవల్య ఘాట్ ప్రాంతంలో ఉన్న ఎత్తైన కొండపై ఈ పాటను చిత్రీకరించారు. ఆ అద్భుతమైన లొకేషన్‌కు వాహనాల రాకపోకలు లేకపోవడంతో, హీరో రామ్ చరణ్, కథానాయిక జాన్వీ కపూర్ సహా యూనిట్ మొత్తం దాదాపు 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేస్తూ లొకేషన్‌కు చేరుకున్నారు.
మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ ట్రెక్కింగ్ చేస్తూ అలసిపోయి, కొద్దిసేపు ఆగి, తిరిగి ముందుకు సాగిన దృశ్యం హైలైట్‌గా నిలిచింది. మెగా పవర్ స్టార్ ఎంతటి నిబద్ధతతో పనిచేశారో ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటపడకుండా యూనిట్‌తో పాటు ట్రెక్కింగ్ చేయడం విశేషం. షూటింగ్ విరామ సమయంలో దర్శకుడు బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ గురించిన ప్రస్తావన మెగా ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, సత్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ‘చికిరి’ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, ‘పెద్ది’ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
